బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 15:45:49

లూసీఫర్‌ రీమేక్‌లో విజయ్‌ దేవరకొండ!

లూసీఫర్‌ రీమేక్‌లో విజయ్‌ దేవరకొండ!

మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన చిత్రం ‘లూసీఫర్‌’. అక్కడ ఘనవిజయం సాధించిన  ఈచిత్ర రీమేక్‌ హక్కులను కథానాయకుడు రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్నారు. తన తండ్రి చిరంజీవితో ఆ సినిమాను రీమేక్‌ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను రామ్‌చరణ్‌ చేయాలని భావించాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు. అందుకే లూసీఫర్‌ రీమేక్‌లో పృథ్వీరాజ్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండను తీసుకోవాలని భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయట. ఇక అధికారికంగా త్వరలోనే  దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుంది. ‘సాహో’ దర్శకుడు సుజిత్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo