గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 11, 2021 , 19:33:27

‘మాస్టర్’ ప్రీ రిలీజ్ బిజినెస్..విజయ్ డబుల్ సెంచరీ

‘మాస్టర్’ ప్రీ రిలీజ్ బిజినెస్..విజయ్ డబుల్ సెంచరీ

ఒకప్పుడు తెలుగులో విజయ్ సినిమా వస్తుంది అంటే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కొన్నేళ్లుగా ఆయన సినిమాలు తెలుగులో కూడా సంచలన విజయం సాధిస్తున్నాయి. పోలీసోడు సినిమాతో తొలిసారి గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. జిల్లా సినిమాతో విజయం అందుకొన్నాడు. ఈ సినిమా తెలుగు రైట్స్ కేవలం కోటిన్నరకు మాత్రమే తీసుకుంటే దాదాపు మూడు కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత అదిరింది సినిమా మంచి విజయం సాధించింది. దాదాపు 7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. మెడికల్ మాఫియాపై అట్లీ కుమార్ సంధించిన ఈ అస్త్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సర్కార్ కూడా 9 కోట్ల వరకు షేర్ వసూలు చేసి విజయ్ రేంజ్ పెంచింది. 2019లో అట్లీ కుమార్ తెరకెక్కించిన విజిల్ కూడా దాదాపు 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. 

మూడు వరుస విజయాలు అందుకుని తెలుగులో కూడా స్టార్ అయిపోయాడు విజయ్. ఇప్పుడు ఈయన నటించిన మాస్టర్ సినిమా ఏకంగా సంక్రాంతికి విడుదలవుతుంది. తెలుగులో రవితేజ క్రాక్, రామ్ పోతినేని రెడ్ సినిమాలకు పోటీగా మాస్టర్ కూడా పండక్కి వస్తుంది. ఇప్పటికే క్రాక్ సినిమా కిరాక్ పుట్టిస్తుంది. దాంతో మాస్టర్ కు భారీ పోటీ వచ్చేసింది. మాస్టర్ పై అంచనాలు పెరగటానికి కారణం విజయ్ ట్రాక్ రికార్డ్. కొన్నేళ్లుగా ఈయన సినిమాలు 200 నుంచి 300 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పుడు పిచ్చెక్కిస్తుంది. తెలుగులో దాదాపు 9 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను తీసుకున్నారు. 

కేరళలో విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ ప్రకారం అక్కడ 7 కోట్లు బిజినెస్ చేసింది మాస్టర్. అలాగే ఓవర్సీస్ 30 కోట్లకు పైగానే అమ్ముడైంది. నార్త్ ఇండియన్ శాటిలైట్‌ రైట్స్‌, డిజిటల్‌ హక్కులు కలిపి 25 కోట్లు, తమిళ శాటిలైట్‌ హక్కులు 30 కోట్లు, ఓటీటీ రైట్స్‌ 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఆడియో వగైరా కలిపి మరో 5 కోట్ల వరకు వచ్చాయి. ఎలా చూసుకున్నా కూడా మాస్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లకు పైగానే జరిగింది. ఈ చిత్రం కరోనా సమయంలో కూడా ఒక్క తమిళనాడులోనే ఏకంగా 700 థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. కేరళలో 200, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో కలుపుకుని 400 థియేటర్లు, కర్నాటకలో 100, నార్త్‌ ఇండియాలో 1000 థియేటర్స్‌లో విడుదలవుతుంది మాస్టర్.

ఇవి కూడా చ‌ద‌వండి

ప్ర‌భాస్ తో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ మీటింగ్

స‌ద్గురును క‌లిసిన స‌మంత

రవితేజతో హ్యాట్రిక్ కొట్టి చూపించాడు

'గాడ్సే' గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

ర‌ష్మిక రాంగ్ స్టెప్ వేసిందా..?

త‌న పెళ్ళిపై ప్ర‌క‌ట‌న ఇచ్చిన బాలీవుడ్ హీరో

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo