మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 14:58:09

అభిమాని చెప్పును చేతితో తీసి ఇచ్చిన స్టార్ హీరో

అభిమాని చెప్పును చేతితో తీసి ఇచ్చిన స్టార్ హీరో

త‌మిళ‌నాట ర‌జ‌నీకాంత్ త‌ర్వాత ఆ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్. న‌ట‌న‌తోనే కాకుండా ఔన్న‌త్యంతోను ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ఈ హీరో. శ‌నివారం బాల సుబ్ర‌హ్మ‌ణ్యంని క‌డ‌సారి చూసేందుకు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌కు విజయ్ వెళ్ళ‌గా, ఆయ‌న‌ని చూసిన అభిమానులు విజ‌య్‌ని చుట్టుముట్టారు. పోలీసుల స‌హ‌కారంతో అక్క‌డ నుండి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాడు.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అంత్య‌క్రియ‌ల‌కు విజ‌య్ హాజ‌రైన స‌మ‌యంలో అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విజ‌య్‌ని సేఫ్‌గా తీసుకెళ్ళేందుకు పోలీసులు త‌మ లాఠీల‌కు ప‌ని చెప్పారు. అయితే పోలీసుల నుండి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో  ఓ అభిమాని చెప్పు జారవిడుచుకున్నాడు. అది చూసిన విజ‌య్ త‌న చేతితో చెప్పుని తీసి అభిమానికి అందించ‌బోయాడు. ఈ సంఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ప్ర‌స్తుతం  ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 


logo