‘మాస్టర్’ 4 డేస్ కలెక్షన్స్..విజయ్ ఖాతాలో మరో సక్సెస్

మెల్లగా తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకుంటున్నాడు విజయ్. ఇప్పుడు ఈయనకు టాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ వచ్చింది. దానికి మాస్టర్ సినిమాకు వస్తున్న వసూళ్లే సాక్ష్యం. ప్యాండమిక్ తర్వాత ఇండియాలో థియేటర్లలో విడుదలైన తొలి భారీ సినిమా ఇదే. తెలుగులో క్రాక్, రెడ్ లాంటి సినిమాలు విడుదలైనా కూడా వాటి ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్లు మాత్రమే. కానీ మాస్టర్ సినిమా బిజినెస్ దాదాపు 200 కోట్లు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకున్న మాస్టర్ సినిమాకు వసూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లోనే దాదాపు 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మాస్టర్.. తెలుగులోనూ సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4 రోజుల్లో 10.37 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినా.. కొన్ని చోట్ల మాత్రం 100% టికెట్స్ అమ్మేస్తున్నారు. తమిళనాట మాస్టర్ టికెట్స్ కోసం మినీ యుద్ధమే జరుగుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. ఎలా చూసుకున్నా కూడా కరోనా వైరస్ తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న భయం పోగొట్టి థియేటర్ ల వరకు వాళ్లను రప్పించడంలో సక్సెస్ అయ్యాడు మాస్టర్. మరి ఏపీ, తెలంగాణలో నాలుగో రోజు ఎంత వసూలు చేసింది..నాలుగు రోజుల్లో మొత్తం ఎంత తీసుకొచ్చింది చూద్దాం..
ఏపీ తెలంగాణలో ‘మాస్టర్’ డే 4 వసూళ్లు..
నైజాం – 30 లక్షలు
సీడెడ్ – 33 లక్షలు
ఉత్తరాంధ్ర – 29 లక్షలు
ఈస్ట్ – 13 లక్షలు
వెస్ట్ – 12 లక్షలు
కృష్ణా – 14 లక్షలు
గుంటూరు – 11 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు
నాలుగో రోజు ఏపీ తెలంగాణలో వచ్చిన వసూళ్లు.. 1.48 కోట్లు షేర్
ఏపీ, తెలంగాణలో 4 డేస్ కలెక్షన్స్..
నైజాం – 2.59 కోట్లు
సీడెడ్ – 2.10 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.58 కోట్లు
ఈస్ట్ – 96 లక్షలు
వెస్ట్ – 78 లక్షలు
కృష్ణా – 79 లక్షలు
గుంటూరు – 1.05 కోట్లు
నెల్లూరు – 45 లక్షలు
ఏపీ తెలంగాణలో 4 డేస్ కలెక్షన్స్.. 10.37 కోట్లు షేర్ (జరిగిన బిజినెస్ 9 కోట్లు)
మరిది కోసం సినిమా సెట్ చేసిన సమంత..!
తెరపైకి నాగార్జున-పూరీ కాంబినేషన్..?
కీర్తిసురేశ్ లుక్ మహేశ్‌బాబు కోసమేనా..?
రవితేజకు రెమ్యునరేషన్ ఫార్ములా కలిసొచ్చింది..!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మద్యానికి డబ్బు ఇవ్వలేదని.. భార్యను చంపేశాడు
- భర్తపై కోపంతో కొడుకును రోడ్డుపై వదిలేసిన తల్లి
- వేధింపులా.. అయితే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి
- వైజాగ్ కేంద్రంగా గంజాయి దందా
- పెట్రో వాత మళ్లీ మొదలు.. ఎంత పెరిగిందంటే..?
- దురాజ్‌పల్లి జాతర.. రేపటినుంచి వాహనాల దారి మళ్లింపు
- కిడ్నాప్.. 6 గంటల్లో ఛేదించారు
- వాణి వినిపించాలంటే.. విద్యావేత్తకే పట్టం కట్టాలె..
- పదపద.. ప్రచారానికి..
- ఇక ప్రజా క్షేత్రంలో...సమరమే..