శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 01, 2020 , 10:25:25

కీలక నిర్ణ‌యం తీసుకున్న విజ‌య్ ఫౌండేష‌న్

కీలక నిర్ణ‌యం తీసుకున్న విజ‌య్ ఫౌండేష‌న్

క‌రోనా సంక్షోభంలో ఇబ్బందుల‌కి గుర‌వుతున్న ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు విజ‌య్ దేవ‌రకొండ‌ రూ. కోటితో ‘ది  దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్‌)’‌, రూ. 25 లక్షలతో ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్(ఎంసీఎఫ్‌)‌’ అనే రెండు చారిటీ సంస్థలను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఎంసీఎఫ్ ద్వారా కొద్ది రోజులుగా నిత్యావ‌స‌రాలు అందిస్తూ వ‌స్తున్న విజ‌య్ ఫౌండేష‌న్ కొత్త వినతులను స్వీకరించడాన్ని నిలిపి వేసింది. ఈ విష‌యాన్ని ప్ర‌క‌ట‌న రూపంలో తెలిపింది.

రూ.25 ల‌క్ష‌ల‌తో మొదలైన ఎంసీఎఫ్ దాదాపు రెండు వేల కుటుంబాల‌కి అండ‌గా నిల‌వాల‌ని భావించింది. అయితే దాత‌లు ఇచ్చిన విరాళాల వ‌ల‌న 6000 కుటుంబాలకు సాయం చేసిన‌ట్టు పేర్కొన్నారు. గత 5 రోజుల నుంచి తమకు సహాయం చేయాలని 77,000లకు పైగా వినతులు వచ్చాయి. కానీ మా దగ్గర ఉన్న నిధులు అంతమందికి సహాయం అందజేయడానికి సరిపోవని చెప్పడానికి చింతిస్తున్నాం.వ‌చ్చిన విన‌తుల‌లో ఉన్న మొత్తంతో సాధ్య‌మైనంత సాయం చేస్తాం. మా సేవ‌లు మ‌రింత ముందుకు సాగాలంటే  మిడిల్‌ క్లాస్‌ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొంది


logo