శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 05, 2020 , 08:58:23

విజ‌య్‌కి మ‌ద్దతుగా టాలీవుడ్‌.. మేమున్నాం అన్న మ‌హేష్‌

విజ‌య్‌కి మ‌ద్దతుగా టాలీవుడ్‌.. మేమున్నాం అన్న మ‌హేష్‌

క‌రోనా సంక్షోభం న‌డుస్తున్న ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి చేయూత‌గా నిలిచేందుకు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు త‌మ చేత‌నంత సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ‘మిడిల్ క్లాస్ ఫండ్’ పేరిట రూ.25 లక్షలతో నిధిని ఏర్పాటు చేసింది. ఆ త‌ర్వాత  సుమారు రూ. 50 లక్షలు విరాళాలను విజయ్ టీమ్ సేకరించగా, మొత్తం మీద రూ. 75 లక్షలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసరాలు అందజేస్తున్నారు విజయ్.

విజ‌య్ చేస్తున్న సాయంపై కొన్ని వెబ్‌సైట్స్ త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించాయి. విజయ్ దగ్గర 7500 మందికి సహాయం చేసేంత నిధులు ఉంటే ఇప్పటి వరకు కేవలం 2200 మందికి మాత్రమే సహాయం అందించారని పేర్కొన్నాయి. అలాగే, విజయ్ స్థాపించిన వెబ్‌సైట్ ద్వారా ఇప్పటి వరకు 77వేల అప్లికేషన్లు రావడంతో ఇక వాటిని స్వీకరించడం మానేశారని కూడా రాశారు. ఇలాంటి వార్త‌ల‌తో విసిగిపోయిన విజ‌య్ డైరెక్ట్‌గా ఓ వీడియో ద్వారా త‌ప్పుడు క‌థ‌నాల‌పై మండిప‌డ్డారు. తమపై తప్పుడు వార్తలు రాస్తోన్న వెబ్‌సైట్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

స‌మాజంలో మూడు ర‌కాల మ‌నుషులు ఉంటారు. ఒకరు సాయం కోసం ఎదురు చూసేవారు, మ‌రొక‌రు ఆప‌ద‌లో ఉన్న వారికి తోచినంత సాయం చేసే వారు. మూడోవారు సంక్షొభంలో సంపాదించాల‌నుకునేవారు. ఈ రోజు నేను మూడో వారి గురించి మాట్లాడుతున్నాను అంటూ ఓ వీడియోని విడుద‌ల చేశారు విజ‌య్.  ఇందులో త‌న‌పై లేని పోనివి త‌ప్పుడు వార్త‌లు రాస్తూ, నన్ను బ్లాక్ మెయిల్ చేద్ధామ‌ని చూస్తున్నారు. 

మీరు ఇంటర్వ్యూలు అడిగితే మేము ఇవ్వాలి. ఇవ్వకపోతే మా మీద తప్పుడు వార్తలు రాస్తారు. మీ తప్పుడు అభిప్రాయాలు అందరి మీద రుద్దుతారు. చిల్లర కబుర్లు రాసి మళ్లీ మీరే డబ్బులు సంపాదిస్తారు. నాకు నచ్చినప్పుడు, నేను అనుకున్నప్పుడు, నాకు కుదిరినప్పుడు, నేను ఎలా ఇవ్వాలో, ఎవ్వరికి ఇవ్వాలో, నా మనసుకు ఎవరు కనెక్ట్ అయితే వాళ్లకు ఇస్తా. అది నా ఇష్టం. కష్టపడి సంపాదించిన డబ్బులు.. బేసిక్ కామన్‌ సెన్స్ ఎలా లేదు మీకు’’ అంటూ కూల్‌గా క్లాస్ పీకారు విజ‌య్. అయితే ఈ విష‌యంలో విజ‌య్‌కి టాలీవుడ్ సెల‌బ్రిటీల నుండి ఫుల్ మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. 

 ప్రజల ప్రేమ, గౌరవాన్ని పొందడం  వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, కృషి, సహనం, మోహం, త్యాగం ఉంటుంది. నీ భార్యకు మంచి భర్తగా ఉండటానికి నువ్వు పనిచేస్తావు. నీ పిల్లలు కోరుకున్నట్టు సూపర్ హీరో తండ్రిగా ఉంటావు. నీ అభిమానులు కోరుకునే సూపర్ స్టార్‌గా ఉంటావు. అయితే, ఎవ‌రో ఒక వ్యక్తి, డబ్బు కోసం నిన్నుఅగౌర‌వ‌ప‌ర‌చ‌డం,త‌ప్పుడు వార్త‌లు రాయడం చేస్తుంటాడు. పాఠ‌కుల‌కి త‌ప్పుడు వార్త‌లు అందిస్తాడు. ఈ సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు అభిమానుల‌ని కాపాడాల‌ని నేను భావిస్తున్నాను. ఇవన్నీ సహ‌జం అని భావిస్తోన్నఈ  సమాజం నుంచి నా పిల్లలను రక్షించాలని కోరుకుంటున్నాను. తమపై తప్పుడు వార్తలు రాస్తూ, తమను అగౌరపరుస్తూ, సమిష్టిగా తమపై అబద్ధాలను ప్రచారం చేస్తోన్న ఈ ఫేక్ వెబ్‌సైట్స్‌‌పై చర్యలు తీసుకోవాలని పరిశ్రమను కోరుతున్నాను. కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్‌సైట్స్’’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక మ‌హేష్‌తో పాటు ర‌వితేజ‌, దర్శకులు కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తో పాటు మ‌రి కొంత మంది ప్ర‌ముఖులు విజయ్‌కు అండగా ఉంటామని ట్వీట్లు చేశారు. ఈ స‌మ‌యంలో అంతా క‌లిసి క‌ట్టుగా పోరాడాల్సి ఉంద‌ని అన్నారు. మ‌రి ఈ విష‌యాన్ని సినీ పెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకొని త‌ప్పుడు వార్త‌లు రాసే వెబ్‌సైట్స్‌పై చ‌ర్య‌లు తీసుకుంటుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. logo