మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Aug 05, 2020 , 23:39:39

బ్లాక్‌ అండ్‌ వైట్‌ లవ్‌స్టోరీ

బ్లాక్‌ అండ్‌ వైట్‌ లవ్‌స్టోరీ

సుహాస్‌, చాందిని చౌదరి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కలర్‌ఫొటో’. సందీప్‌రాజ్‌  దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  సాయిరాజేష్‌ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం హీరో విజయ్‌ దేవరకొండ విడుదలచేశారు.  ‘టీజర్‌ బాగుంది. యువబృందం తమ కలల్ని సాకారం చేసుకోవడం  ఆనందంగా ఉంది. సినిమా పెద్ద విజయాన్ని సాధించి యూనిట్‌ అందరికి మంచి పేరుతెచ్చిపెట్టాలి’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు. ‘వినోదానికి భావోద్వేగాల్ని జోడిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. వర్ణ సమస్యను దాటుకొని ఓ ప్రేమజంట ఎలా ఏకమైంది. వారి ప్రేమకథకు విలన్‌గా మారిన రామరాజు ఎవరన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది. సునీల్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తారు’ అని చిత్రబృందం తెలిపింది.  వైవాహర్ష ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.


logo