శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 02:20:07

ప్రేమకోసం అన్వేషించండి

ప్రేమకోసం అన్వేషించండి

తెరమీద పాత్రల్లోనే కాదు..తెరవెనక జీవితంలో కూడా విలక్షణ వ్యక్తిత్వంతో దర్శనమిస్తారు అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ.  మనసులోని భావాల్ని ఎలాంటి దాపరికం లేకుండా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో...దాని తాలూకు వివరణ చక్కటి తాత్వికతతో ఆకట్టుకుంటోంది. అందులో ఆయన ఓ చిన్నారిని ఆప్యాయంగా హత్తుకొని కనిపిస్తున్నారు. ‘మీ జీవితాన్ని ప్రేమతో నింపుకోండి. నా వృత్తిని నేను ఎంతగానో ప్రేమిస్తాను. 

నాకు ఇష్టమైన ఆటల్ని,  భోజనాన్ని ఆస్వాదిస్తాను. నిరంతరం నన్ను ప్రేమించే వ్యక్తుల సాంగత్యంలోనే ఉండాలని కోరుకుంటాను. వారి గురించే అనుక్షణం ఆలోచిస్తా..నా సమయాన్ని వెచ్చిస్తాను. వారందరి వల్లే నా జీవితం గొప్పగా  ఉందనుకుంటున్నా. స్వచ్ఛమైన ప్రేమకోసం అన్వేషించండి. గెలుపు సాధించడానికి ప్రయత్నించండి’ అని విజయ్‌దేవరకొండ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఫైటర్‌' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. కొంతభాగం షూటింగ్‌ పూర్తయింది.