బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 12:17:25

పెట్ డాగ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

పెట్ డాగ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ పాపులారిటీ పొందిన యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆయ‌న‌కి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్టాగ‌ అంతా ఇంతా కాదు. విజ‌య్ స్టైల్‌ని ఎక్కువ‌గా ఫాలో అవుతూ ఉండే ఫ్యాన్స్ ఎప్ప‌టికప్పుడు విజ‌య్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌పై ఓ క‌న్నేస్తుంటారు. ఈ క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న సోష‌ల్ మీడియా ద్వారా సినిమాతో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ ఉంటాడు. 

గ‌త రాత్రి విజ‌య్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్ డాగ్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో త‌ల‌పై కుక్క‌ని కూర్చోపెట్టుకొని చిరున‌వ్వు చిందిస్తున్నాడు. మరో ఫోటోలో బెడ్‌పై కుక్క‌తో ఫోటోకి ఫోజులిచ్చాడు. ఇందులో విజ‌య్ పెట్ డాగ్ క‌ళ్ళు ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. విజ‌య్ లానే ఆయ‌న పెట్‌డాగ్ కూడా చాలా అందంగా ఉంద‌ని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo