శనివారం 30 మే 2020
Cinema - May 02, 2020 , 13:17:02

గర్ల్ ఫ్రెండ్ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

గర్ల్ ఫ్రెండ్ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఏ విష‌యాన్నైన సుత్తి లేకుండా సూటిగా చెబుతాడ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. తాజాగా ఆయ‌న నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిల విష‌యంలో తను కోరుకునే కొన్ని క్వాలిటీస్ వివ‌రించాడు. ఇందుకు ప్ర‌శ్న‌గా అలాంటి అమ్మాయిని మీరు మీ జీవితంలో ఎప్పుడైన క‌లిసారా అంటే అవున‌నే స‌మాధానం విజ‌య్ ద‌గ్గ‌ర నుండి వ‌చ్చింది.

విజ‌య్ స‌మాధానాన్ని బ‌ట్టి చూస్తుంటే ఇత‌ను ఎవరితోనో రిలేష‌న్‌షిప్‌లో ఉండే ఉంటాడ‌ని నెటిజ‌న్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక పెళ్ళి గురించి మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. ప్ర‌స్తుతం జీవితంలో స్థిరపడాలని నా తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఆ దిశ‌లో అడుగులు వేస్తున్నాన‌ని విజ‌య్ స్ప‌ష్టం చేశారు . ప్ర‌స్తుతం విజ‌య్ ఫైట‌ర్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే


logo