సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 00:21:13

అపూర్వ కలయికలో..

అపూర్వ కలయికలో..

తెలుగు చిత్రసీమలో మరో సంచలన కలయికకు రంగం సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, యువతరం ఆరాధ్య కథానాయకుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఫాల్కన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి  నిర్మాతగా అరంగేట్రం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కథాంశాలపరంగా నవ్యతకు, విలక్షణతకు ప్రాధాన్యతనిచ్చే సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ తొలిసారి నటిస్తుండటంతో ఈ సినిమా ప్రకటన రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా గురించి సుకుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానిస్తూ ‘మన రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండతో సినిమా అనౌన్స్‌ చేయడం సంతోషంగా ఉంది. సెట్స్‌లో అతని ఎనర్జిటిక్‌ పర్‌ఫార్మెన్స్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘సోమవారం నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. 2022లో  చిత్రాన్ని ఆరంభిస్తాం. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ వ్యయంతో రూపొందిస్తాం.  ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం. మా సంస్థ ద్వారా భవిష్యత్తులో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు.


logo