బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 11:30:53

పూరీ బ‌ర్త్ డే: స‌్పెష‌ల్ విషెస్ అందించిన రౌడీ బాయ్

పూరీ బ‌ర్త్ డే: స‌్పెష‌ల్ విషెస్ అందించిన రౌడీ బాయ్

టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ రోజు ఆయ‌న 54వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు, సెల‌బ్రిటీలు పూరీ జ‌గ‌న్నాథ్‌కు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌న రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పూరీకు  స్పెష‌ల్ విషెస్ అందించారు. 

పూరీ జ‌గ‌న్నాథ్ స‌ర్ , హ్యాపీ బ‌ర్త్ డే. మీరు నన్ను సంతోషంగా ఉంచారు. యుద్ధం చేయ‌డంలోను సంతోషాన్ని చూపించారు. న‌టుడిగా సంతోషంగా ఉన్నాను, వ్య‌క్తిగాను హ్యాపీగానే ఉన్నాను. ఈ ప్ర‌త్యేక‌మైన మూవీ మ‌నిద్దిరిని ఒక్క‌టి చేసింది. సినిమా పరంగానే కాకుండా మిమ్మ‌ల్ని నా హృద‌యంలో ఎప్ప‌టికీ పెట్టుకుంటాను అని విజ‌య్ కాస్త ఎమోష‌న‌ల్‌గా ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ కాంబినేష‌న్‌లో ఫైట‌ర్ ( వ‌ర్కింగ్ టైటిల్‌) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 


 


logo