విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ ఉపశీర్షిక. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం నుంచి గోవాలో షూటింగ్ పునః ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రకటించిన చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఇందులో కండలు తిరిగిన దేహంతో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్‌గా నవ్యరీతిలో విజయ్‌దేవరకొండ కనిపిస్తున్నారు. ‘ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించబోతున్నాం. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా సాగే ఈ యాక్షన్ సన్నివేశాల్లో విదేశీ ఫైటర్స్ భాగం కాబోతున్నారు. ఈ పోరాట ఘట్టాల కోసం మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్‌దేవరకొండ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు’ అని చిత్రబృందం తెలిపింది. ‘రక్తపాతం, స్వేదం, హింస…‘లైగర్’ షూటింగ్ పునఃప్రారంభం’ అంటూ విజయ్‌దేవరకొండ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌రాయ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.