బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 04, 2020 , 16:45:39

విజయ్‌ దేవరకొండ పేరుతో నకిలీ ఖాతా..

విజయ్‌ దేవరకొండ పేరుతో నకిలీ ఖాతా..

టాలీవుడ్‌ యాక్టర్‌ విజయ్‌ దేవరకొండ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి  ఫేస్‌బుక్‌ పేజీ  పెట్టి..యువతులకు గాలం వేస్తున్నాడు. దీంతో విజయ్‌ దేవరకొండ మేనేజర్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితుడు విజయ్‌ దేవరకొండ పేరు మీద ఫేస్‌బుక్‌ లో  పేజీ తోపాటు వాట్సాప్‌ నంబర్‌ సృష్టించి..అందులో విజయ్‌  మహిళా ఫ్యాన్స్‌తో ఛాటింగ్‌ చేస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఛాటింగ్‌లో ఓ మహిళా అభిమాని విజయ్‌ను కలవాలని అడిగింది. అయితే విజయ్‌ను కలవాలంటే మొదట డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ను కలవాలంటూ..నిందితుడు  ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు.

అయితే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ నంబర్‌ అంటూ నిందితుడు అతడి సొంత ఫోన్‌ నంబరే ఆమెకు ఇచ్చాడు. మహిళను తనతో సహజీవనం చేయాలని నిందితుడు అడిగినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వెల్లడించారు. సోషల్‌మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువతులకు గాలం వేస్తున్న నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 66ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విజయ్‌దేవరకొండ పేరుతో మోసాలకు పాల్పడుతున్న విషయాన్ని కొందరు అభిమానులు తన దృష్టికి తీసుకురావడంతో ..విజయ్‌ మేనేజర్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


logo