శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 11:42:55

యూర‌ప్‌లో విజ‌య్ చ‌క్క‌ర్లు.. ఫుడ్‌ని ఆస్వాదిస్తున్న రౌడీ బాయ్

యూర‌ప్‌లో విజ‌య్ చ‌క్క‌ర్లు.. ఫుడ్‌ని ఆస్వాదిస్తున్న రౌడీ బాయ్

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా సంగ‌తుల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ టూర్ విష‌యాల‌ని త‌ర‌చూ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయ‌న యూర‌ప్‌కు వెళ్ళిన‌ట్టు చెప్పుకొచ్చాడు. ఫుడ్ తినుకుంటూ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ప‌నితో విసుగు వ‌చ్చిన‌ప్పుడు , నటుడిని కావ‌డం వ‌ల‌న అసౌక‌ర్యాల నుండి త‌ప్పించుకునేందుకు, మ‌రీ ముఖ్యంగా అద్భుత‌మైన ఫుడ్ కోసం అక్కడికి వెళ్ళాల‌నిపిస్తుందంటూ యూర‌ప్‌పై త‌న‌కున్న ప్రేమ‌ని చాటాడు విజ‌య్.

ఇటీవ‌ల  తన అమ్మ 50వ బర్త్ డే సందర్భంగా ఓ క్యూట్ వీడియోను షేర్ చేశాడు. క్రికెట్‌లో హాఫ్ సెంచరీ కొడితే ఎలా సిగ్నేచర్ మూమెంట్ పెడతారో అలా బ్యాట్ ఎత్తి చూపించారు. ఎంతైనా దేవరకొండ ఫ్యామిలీ వెరైటీ అని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టారు. అయితే ప్ర‌స్తుతం విజ‌య్ షేర్ చేసిన పిక్‌లో విజ‌య్ హెయిర్ స్టైల్ అందరి దృష్టిని ఆక‌ర్షించింది. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాకా లేదంటే సుకుమార్ సినిమా గురించి ఇలా పెంచుతున్నాడా అనే డిస్క‌ష‌న్ మొదలైంది.