ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 16, 2020 , 19:10:36

హీరోల సోషల్‌ మీడియా రికార్డులు!

హీరోల సోషల్‌ మీడియా రికార్డులు!

తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య కలెక్షన్లు, ఓపెనింగ్స్‌ విషయంలోనే కాదు తాజాగా సోషల్‌మీడియాలో ఫేమ్‌ విషయంలో కూడా కాంపీటిషన్‌ ప్రారంభమైంది. సినిమా పబ్లిసిటి ప్రారంభం నుండి తమ సినిమాల పోస్టర్ల, లైక్‌లు, –టైలర్స్‌ వ్యూస్‌, పాటల వ్యూస్‌ అంటూ ఊదరగొడుతూ ఇలా పలు రకాల పోటీలు గత కొంతకాలంగా చూస్తునే వున్నాం. ఇక తాజాగా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగమ్‌ ల్లో తమ ఫాలోవర్స్‌ అంటూ పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేష్‌బాబు ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌ 10 మిలియన్స్‌ దాటారని ప్రకటించగానే ఆ వెంటనే బన్నీ తన సోషల్‌మీడియా ఫాలోవర్స్‌ సంఖ్యను చూపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విజయ్‌దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు 8 మిలియన్స్‌ ఫాలోవర్స్‌ వున్నారని ప్రెస్‌ రిలీజ్‌ చేయగానే నితిన్‌ కూడా ట్విట్టర్‌లో తనకు మూడు మిలియన్స్‌ ఫాలోవర్స్‌ చేరారని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. ప్రస్తుతం మొత్తం డిజిటలైజేషన్‌ అవతున్న ఈ తరుణంలో హీరోలంతా తమ సోషల్‌మీడియా అకౌంట్‌లపై కాన్సట్రేషన్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo