శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 11:49:47

విజయ్ దేవ‌ర‌కొండ 'బీ ది రియ‌ల్ మ్యాన్' ఛాలెంజ్ వీడియో

విజయ్ దేవ‌ర‌కొండ 'బీ ది రియ‌ల్ మ్యాన్' ఛాలెంజ్ వీడియో

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ విసిరిన బీ ది రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన విజ‌య్ దేవ‌ర‌కొండ కొద్ది సేప‌టి క్రితం త‌న టాస్క్‌కి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఇందులో త‌న దైనందిన కార్య‌క్ర‌మాల‌ని చూపించాడు. దాదాపు 9 గంట‌లు ప‌డుకుంటున్న విజ‌య్ లేవ‌గానే వైన్ బాటిల్స్ ని వాట‌ర్ బాటిల్స్‌గా ఉప‌యోగిస్తూ అందులో నీటిని నింపి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆ త‌ర్వాత లీట‌ర్ నీటిని తాగాడు. పాత క‌వర్స్‌ని డ‌స్ట్ క‌వ‌ర్స్‌గా ఉప‌యోగించాల‌ని వీడియోలో పేర్కొన్నాడు.

ఆ త‌ర్వాత మ్యాంగో ఐస్ క్రీమ్ త‌యారు చేసి త‌న కుటుంబ స‌భ్యుల‌కి అందించాడు. టీవీ తుడిచి గేమ్ ఆడాడు. ఇది త‌న లాక్‌డౌన్‌లో న‌డుస్తున్న ప్ర‌క్రియ అని వీడియో ద్వారా తెలిపాడు. సంక్షోభం స‌మ‌యంలో మ‌నం మ‌న‌తోటి వారికి అండ‌గా నిలుద్ధాం అని పేర్కొన్నాడు. ఇక ఈ ఛాలెంజ్‌ని దుల్క‌ర్ స‌ల్మాన్‌కి విసిరాడు విజ‌య్. 


logo