బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 22:52:26

హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు

హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు

హైదరాబాద్:  సెన్సేషనల్ స్టార్  విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.    త‌న అభిమానుల‌ని రౌడీ బాయ్స్‌గా పిలుచుకుంటూ వారికి కావ‌ల‌సినంత ప్రేమ‌ని పంచుతుంటారు హీరో విజ‌య్.  సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విజ‌య్   త‌న ఇన్‌స్టాగ్రాములో 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని   సంపాదించుకున్నారు. దక్షిణాదిలో  ఇన్‌స్టాలో  9 మిలియన్ ఫాలోవర్స్  కలిగిన ఏకైక  హీరోగా    విజయ్ దేవరకొండ రికార్డ్  క్రియేట్ చేశారు.

ద‌క్షిణాది హీరోల్లో ఎవ‌రికీ  సాధ్యం కానీ  సరికొత్త రికార్డును  విజయ్‌ చేరుకోవడంపై అభిమానులు తెగసంబరపడిపోతున్నారు.  రెండేళ్ల క్రితం 2018 మార్చి 7న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాని ప్రారంభించారు. త‌క్కువ  వ్యవధిలోనే  9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డం ఓ రికార్డుగా చెబుతున్నారు.  విజ‌య్ దేవ‌ర‌కొండ  ప్రస్తుతం పూరీ జ‌గ‌న్నాథ్  దర్శకత్వంలో `ఫైట‌ర్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.    హీరో విజయ్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ రాబోతున్నది. 
logo