గురువారం 28 మే 2020
Cinema - May 14, 2020 , 17:44:44

వెబ్ సిరీస్‌ల‌పై దృష్టి సారిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

వెబ్ సిరీస్‌ల‌పై దృష్టి సారిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కి సంబంధించిన స్టార్స్ డిజిట‌ల్ రంగంపై ఆస‌క్తి బ‌రుస్తున్నారు. ఇప్పటికే స‌మంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, ఆమె బాట‌లో ప‌లువురు స్టార్స్ ప‌య‌నిస్తున్న‌ట్టు తెలుస్తుంది.  యూత్ సెన్సేష‌న‌ల్ హీరో  విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఓ వెబ్ సిరీస్ మొద‌లెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. 

‘ఆహా’ అనే ఓటీటీకి  బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా  ఉన్న విజ‌య్ ఆహాకి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్‌లలో పాలుపంచుకోబోతున్నాడు. విజ‌య్ నిర్మాణ సంస్థ అయిన కింగ్‌ ఆప్ ది హిల్స్ త‌ర‌పున ఒక‌ట్రెండు వెబ్ సిరీస్‌లు ప్ర‌స్తుతం ప్లానింగులో ఉన్నాయి. అందులో ఓ ప్రాజెక్టుని కేవీఆర్ మ‌హేంద్ర‌కి అప్ప‌జెప్పే అవ‌కాశాలున్నాయి.  మ‌హేంద్ర ఇదివ‌ర‌కు విజ‌య్ త‌మ్ముడు ఆనంద్  ప్ర‌ధాన పాత్ర‌లో దొర‌సాని సినిమా తెర‌కెక్కించారు. ఆ ప‌రిచ‌యం కొద్ది  మ‌హేంద్ర‌కు ఈ వెబ్ సిరీస్ అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.


logo