ఆదివారం 31 మే 2020
Cinema - May 05, 2020 , 22:34:41

రెమ్యునరేషన్‌ తగ్గించుకున్నాడు

రెమ్యునరేషన్‌ తగ్గించుకున్నాడు

లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాల్ని ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకొని నిర్మాతలను ఆదుకోవాలంటూ సినీ ప్రముఖులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ తన పారితోషికాన్ని ఇరవై ఐదు శాతం తగ్గిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విజయ్‌ ఆంటోనీ తమిళంలో అగ్ని సిరాగుగల్‌, ఖాకీ, తమీజసరన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలకు ఖరారైన పారితోషికం కంటే ఇరవై ఐదు శాతం తగ్గించి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు  విజయ్‌ ఆంటోనీ తెలిపారు. logo