కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉంటూ..తరచూ వార్తల్లో నిలుస్తున్నారు విఘ్నేశ్ శివన్-నయనతార.
నయన్ గతంలో తన రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ దాచిపెట్టకపోయినా..మీడియా ముందు మాత్రం మాట్లాడేది కాదు. ఇప్పటికే నయన్-విఘ్నేశ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సింది. కానీ కోవిడ్ సంక్షోభంతో పెండ్లి వాయిదా పడుతూ వచ్చింది. అయితే కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడగానే వెడ్డింగ్ విషయంలో ముందడుగు వేయాలని అనుకుంటుందట నయన్.
ట్రావెలింగ్ రూల్స్ లో సడలింపులు వచ్చిన తర్వాత వెడ్డింగ్ కు ప్లాన్ చేయాలని భావిస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. ఇన్ స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ నయనతార మేడమ్‌ను ఎందుకు పెండ్లి చేసుకోవడం లేదు..మేం వెయిట్ చేస్తున్నామని విఘ్నేశ్ శివన్ ను ప్రశ్నించాడు. దీనికి విఘ్నేశ్ బదులిస్తూ.. పెండ్లి కోసం డబ్బు ఆదా చేస్తున్నాం..కరోనా కూడా పోవాలి కదా అంటూ కామెంట్ పెట్టాడు.
నయనతార ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న అన్నాత్తేలో నటిస్తోంది. గతంలో ఓనమ్ సందర్బంగా నయన్-విఘ్నేశ్ సంప్రదాయక వస్త్రధారణలో కలిసి దిగిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com