కోలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్స్ లో నయనతార- విఘ్నేష్ శివన్ జంట ఒకటి. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదే ఉంటుందని అందరు భావించిన అది జరిగేలా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారే ఈ జంట నిత్యం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు.
లాక్డౌన్ వలన షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన విఘ్నేష్ శివన్ తన ఫాలోవర్స్‌తో కొద్ది సేపు ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ఇందులో నయనతారతో మీరు దిగిన ఫోటో, అందులో మీకు బాగా నచ్చిన ఫోటో ఏది అని ప్రశ్నించారు. ఇంకో నెటిజన్ అయితే.. నయన్‌లో ఏ లక్షణం మీకు చాలా ఇష్టమని అడిగేశాడు. దీనికి నయనతారలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఇష్టమని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.