బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 19:42:34

ఒకే ఫ్రేములో విఘ్నేశ్‌-న‌య‌న్‌, ఆట్లీ-ప్రియా

ఒకే ఫ్రేములో విఘ్నేశ్‌-న‌య‌న్‌, ఆట్లీ-ప్రియా

కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్ కు ఇండ‌స్ట్రీలో చాలా మంది స్నేహితులున్నార‌నే విష‌యం తెలిసిందే. స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి నుంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్  అనిరుధ్ వ‌ర‌కు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు బ్లాక్ బాస్ట‌ర్ చిత్రాలనందించిన ద‌ర్శ‌కుడు ఆట్లీ. ఈ డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్-న‌య‌న్ కు మంచి స్నేహితుడు. గతేడాది విఘ్నేశ్ శివ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆట్లీ-ప్రియా దంపతులు విఘ్నేశ్‌-న‌య‌న్ ఒక్క‌చోట క‌లిసి సంద‌డి చేశారు.

మ్యాచింగ్ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఈ ఇద్ద‌రు క‌పుల్స్ ఒకే ఫ్రేములో ఉన్నపుడు క్లిక్ మ‌నిపించిన త్రోబ్యాక్ ‌స్టిల్ ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌, న‌య‌న‌తార కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న కాతు వాకుల రెండు కాద‌ల్  చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు విఘ్నేశ్ శివ‌న్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo