ఒకానొక టైంలో బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ల జాబితాలో తప్పకుండా ఈ భామ పేరుంటుంది. ఆమె సినిమా వస్తుందంటే బాక్సాపీస్ వద్ద కలెక్షన్లు వరదలా పారాల్సిందే. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో అర్థమై ఉంటుంది. ది డర్టీ పిక్చర్ (The Dirty Picture) సినిమాతో కుర్రకారుకు కంటి మీద కనుకు లేకుండా చేసిన అందాల భామ విద్యాబాలన్ (Vidya Balan).పెండ్లి తర్వాత బొద్దుగా తయారైన ఈ బ్యూటీ శకుంతలా దేవి సినిమాతో మళ్లీ తెరపై మెరిసింది.
ఈ సినిమాలో అద్బుతమైన నటన కు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకుంది. కొంత కాలంగా ఫిజిక్ పై ఫోకస్ పెట్టిన విద్యాబాలన్ మళ్లీ పాత లుక్ లోకి మారిపోయేందుకు శ్రమిస్తోంది. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫొటోలను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. విద్యాబాలన్ కంప్లీట్ యెల్లో డ్రెస్సు (Yellow Dress)లో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. విద్యాబాలన్ యెల్లో ప్యాంట్, షర్ట్‌లో హొయలు పోతూ పలు రకాలుగా కెమెరా స్టన్నింగ్ హాట్ పోజులిచ్చింది. తాజా ఫొటోల్లో తన ఓరచూపుతో నెటిజన్లను కట్టిపడేస్తుంది విద్యాబాలన్. మళ్లీ మునుపటిలా సైజ్ జీరో లుక్‌లోకి మారిపోతానని చెప్తోంది విద్యాబాలన్.
రాబోయే కాలంలో ఈ సుందరి ఇంకా ఎన్ని పోజులతో అదరగొడుతుందో చూడాలి మరి. ప్రస్తుతం జల్సా (Jalsa) సినిమాలో నటిస్తోంది విద్యాబాలన్. షూటింగ్ దశలో ఉందీ సినిమా. ఇక అప్ కమింగ్ హీరోయిన్లకు గట్టిపోటీనిచ్చేందుకు రెడీ అవుతున్నట్టు చెప్పకనే చెప్తోంది విద్యాబాలన్.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర