సోమవారం 25 మే 2020
Cinema - Apr 04, 2020 , 11:42:13

పారిశుద్ధ్య కార్మికురాలికి థ్యాంక్స్ చెప్పిన విద్యా బాల‌న్‌

పారిశుద్ధ్య కార్మికురాలికి థ్యాంక్స్ చెప్పిన విద్యా బాల‌న్‌

క‌రోనా భ‌యంతో ప్ర‌జ‌లంద‌రు ఇళ్ల‌కే ప‌రిమితం కాగా, అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పని చేసే వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జ‌ర్న‌లిస్టులు ప్రాణాల‌ని ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వీరిని ఇప్పుడు దేవుళ్ళుగా కొలుస్తున్నారు జ‌నాలు. ఇటీవ‌ల పారిశుద్ధ్యాన్ని రిక్షాలో త‌ర‌లిస్తున్న వ్య‌క్తిపై పంజాబ్ వాసులు పూల వ‌ర్షం కురిపించారు. కొంద‌రు న‌గ‌దుతో కూడిన దండ‌ని ఆయ‌న మెడలో వేసి జేజేలు ప‌లికారు.

తాజాగా బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ పారిశుద్ధ్య కార్మికురాలు చేస్తున్న ప‌నిని చూసి త‌న బాల్క‌నీ నుండి ‘మేడమ్‌ థాంక్యూ.. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ గ‌ట్టిగా అర‌చింది. ఇది విన్న ఆమె విద్యా వైపు తిర‌గ‌గా, వెంట‌నే త‌న కెమెరాలో బంధించి ఆ ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ‘కరోనా భయం ఉన్నా..  విధులను స‌క్ర‌మంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్నీ, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడు ఆశీర్వదిస్తాడు.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ఈ ఫోస్ట్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo