ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 11:51:53

డిన్న‌ర్‌కు నో అన‌డంతో షూటింగ్ క్యాన్సిల్ చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి

డిన్న‌ర్‌కు నో అన‌డంతో షూటింగ్ క్యాన్సిల్ చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి

మ‌ధ్య ప్ర‌దేశ్ మంత్రి విజ‌య్ షా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని డిన్న‌ర్ కు ఆహ్వానించ‌డంతో ఆమె నో చెప్పిన కార‌ణంగా షూటింగ్ పర్మీష‌న్ ర‌ద్దు చేశార‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త  అంత‌టా చ‌ర్చనీయాంశంగా మారింది. వివ‌రాల‌లోకి వెళితే విద్యాబాల‌న్ ప్ర‌స్తుతం షేర్నీ అనే సినిమా చేస్తుంది. గ‌త నెల రోజులుగా ఈ చిత్రం మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఫారెస్ట్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే రీసెంట్‌గా వారిని అనుమ‌తించ‌డం లేదు. దీంతో విద్యాబాల‌న్ అండ్ టీం విజ‌య్ షాని క‌లిసారు. 

విజ‌య్ షా.. విద్యాబాల‌న్‌ని డిన్న‌ర్‌కు ఇన్వైట్ చేశాడ‌ని, ఆమె నో అన‌డంతో ప‌ర్మీష‌న్ ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పార‌ట‌. ఈ క‌థ‌నాన్ని ప‌లు వెబ్ సైట్స్ ప్ర‌చురించ‌గా, అది వైర‌ల్‌గా మారింది. అయితే దీనిపై మంత్రి స్పందిస్తూ..  విద్యాబాల‌న్ ఆమె టీమ్ న‌న్ను డిన్న‌ర్‌కు ఆహ్వానించారు. అయితే చిత్ర షూటింగ్‌కు పర్మీష‌న్ ఇవ్వ‌ని కార‌ణంగా వారే ర‌ద్దు చేశారు. ద‌య‌చేసి అస‌త్యాలు ప్ర‌చారం చేయకండ‌ని విజ‌య్ పేర్కొన్నారు. ఈ విష‌యం ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లోను హాట్ టాపిక్గా మారింది