బుధవారం 27 మే 2020
Cinema - Apr 26, 2020 , 08:45:51

1000 పీపీఈ కిట్స్ కోసం విరాళం సేక‌రిస్తున్న విద్యాబాల‌న్‌

1000 పీపీఈ కిట్స్ కోసం విరాళం సేక‌రిస్తున్న విద్యాబాల‌న్‌

క‌రోనాని అరిక‌ట్టేందుకు సైనికులులా పని చేస్తున్న వైద్య‌లు, సిబ్బంది కోసం 1000 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్స్ డొనేట్ చేసేందుకు ముందుకు వ‌చ్చింది విద్యాబాల‌న్. ఇలాంటి క‌ఠిన స‌మ‌యంలో మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించే వైద్యుల కోసం వెయ్యి పీపీఈ కిట్ల‌ని ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఇందులో మీరు కూడా భాగం కావాల‌ని కోరుతున్నాను అని విద్యాబాల‌న్ పేర్కొంది. 

కరోనా రోగుల‌తో క్ష‌ణం తీరిక లేకుండా కాలం గ‌డుపుతున్నారు వైద్యులు. వీరిలో ప్రాణాంత‌క వైర‌స్ ఒక‌రికి చేరిందంటే వారి నుండి 8 నుండి 12 మందికి సోకుతుంది.  దీని వ‌ల‌న క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుప‌త్రులు నిండిపోతాయి. అందుకోస‌మే  పిపిఇ కిట్ల కోసం నిధుల సేకరణక మొద‌లు పెట్టాను. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు సాయం చేయోచ్చు అని విద్యా స్ప‌ష్టం చేసింది. 


logo