శుక్రవారం 03 జూలై 2020
Cinema - Feb 02, 2020 , 18:12:54

మున్నాభాయ్‌-3 రానుందా..!

మున్నాభాయ్‌-3 రానుందా..!

రాజ్‌కుమార్‌ హిరానీ, సంజయ్‌దత్‌ కాంబినేషన్‌లో వచ్చిన మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, లగేరహో మున్నాభాయ్‌ బాక్సాపీస్‌ను షేక్‌ చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధు వినోద్‌ చోప్రా ఈ చిత్రాలను నిర్మించారు. విధు వినోద్‌ చోప్రా దర్శకత్వం వహించిన శిఖారా చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశాడు. మున్నాభాయ్‌ సిరీస గురించి మాట్లాడుతూ..మున్నాభాయ్‌ త్రీక్వెల్‌ చేయాలనుంది. మరిన్ని వినోదాత్మక సినిమాలు తీయాలనుకుంటున్నా. మున్నాభాయ్‌ 3ను కూడా సంజయ్‌, హిరానీతోనే తీస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..అవును ఖచ్చితంగా నేను సంజయ్‌, హిరానీతో కలిసి సినిమా తీస్తా. ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే నిజమైతే సంజయ్‌దత్‌, హిరానీ మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం ఖాయమైనట్టేనంటున్నారు బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు. 


logo