బుధవారం 03 జూన్ 2020
Cinema - Feb 19, 2020 , 23:14:48

ఎర్ర ఎడారిలో..

ఎర్ర ఎడారిలో..

వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ధనుష్‌ నటించిన తమిళ చిత్రం‘అసురన్‌'కు రీమేక్‌ ఇది. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని తెరికాడు ఎర్ర ఏడారిలో చిత్రీకరణ జరుగుతున్నది. ఫైట్‌మాస్టర్‌ పీటర్‌హెయిన్స్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పదిరోజుల పాటు తీసిన ఈ యాక్షన్‌ ఘట్టాలు సినిమాలో ప్రధానాకర్షణగా ఉంటాయి. 12000వేల ఎకరాల్లో ఉండే ఈ ప్రదేశాన్ని రెడ్‌ డిజర్ట్‌ ఆఫ్‌ తమిళనాడుగా పిలుస్తారు. ఇప్పటికే 27రోజులు షూటింగ్‌ చేశాం. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: మణిశర్మ, కథ: వెట్రిమారన్‌.logo