e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home ఇంటర్వూ విజయాన్ని బోనస్‌గా భావిస్తున్నా

విజయాన్ని బోనస్‌గా భావిస్తున్నా

విజయాన్ని బోనస్‌గా భావిస్తున్నా

‘వకీల్‌సాబ్‌’ విజయం దర్శకుడిగానా బాధ్యతను పెంచింది. ఈ సక్సెస్‌ తర్వాత నా నుండి ప్రేక్షకులు వైవిధ్యతను, కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. వారి అంచనాల్ని అందుకోవడానికి నిజాయితీతో వందశాతం శ్రమిస్తా’ అని అన్నారు శ్రీరామ్‌వేణు. మంగళవారం శ్రీరామ్‌వేణు జన్మదినం. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారాయన. ఆ సంగతులివి..

‘వకీల్‌సాబ్‌’ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రానికి ఓటీటీలో చక్కటి ఆదరణ లభిస్తోంది. కొన్ని కారణాల వల్ల థియేటర్‌లో సినిమాను ఎక్కువ రోజులు ఆడించలేకపోయాం. త్వరగా ఓటీటీలో విడుదలకావడంతో థియేటర్‌ రన్‌ కంటిన్యూ అవుతున్న అనుభూతి కలుగుతోంది. ప్రేక్షకులతో పాటు పరిచయస్తులందరూ మంచి సినిమా చేశానని అభినందిస్తున్నారు. తెలియవాళ్లు కూడా నా ఫోన్‌ నంబర్‌ కనుక్కొని ప్రశంసిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది.

ఇరవై రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో విడుదలకావడం మిమ్మల్ని నిరాశపరిచిందా?
సినిమా త్వరగా ఓటీటీలో విడుదలైందనే నిరుత్సాహం నాలో కొంచెం కూడా లేదు. ప్రేక్షకులకునచ్చాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశా. ఆ లక్ష్యాన్ని చేరుకున్నా. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సేఫ్‌ అయ్యారు. థియేటర్‌లలో ఎక్కువ రన్‌ ఉండుంటే మరిన్ని లాభాల్ని గడించేవారు.

ఈ సినిమా ప్రయాణం మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది?
ఈ సినిమా ద్వారా నాకు దక్కిన విజయంతో పాటు పేరుప్రఖ్యాతులు, గుర్తింపును బోనస్‌గా భావిస్తున్నా. పవన్‌ సినిమాకు దర్శకత్వం వహించడమే అఛీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. ఆయన్ని కలవడం, మాట్లాడటం, కలిసి పనిచేయడం అన్ని మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలాయి

సినిమాల వేగాన్ని పెంచే ఆలోచన ఉందా?
పదేళ్ల ప్రయాణంలో కేవలం మూడు సినిమాలే చేశా. భవిష్యత్తులో పరిగెత్తుతూ సినిమాలు చేస్తానని చెప్పను. సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్‌ రాకుండా జాగ్రత్తపడతా. తొలి సినిమా వైఫల్యం వల్లే ఏడేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఈ విరామం విలువైన పాఠాలు నేర్పించింది. ఆ అనుభవాల నుంచి జాగ్రత్తపడుతూ మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా. కథ కంటే ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌చేస్తూ వారికి అర్థమయ్యేలా సినిమా చేయడం ముఖ్యమని తెలుసుకున్నా. ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ‘ఎమ్‌సీఏ’, ‘వకీల్‌సాబ్‌’ సినిమాలు చేసి విజయాల్ని అందుకున్నా.

ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకున్నారు?
‘వకీల్‌సాబ్‌’ విషయంలో ఇండస్ట్రీ నుంచి చక్కటి ప్రశంసలొచ్చాయి. చిత్రసీమలో నేను గురువుగా భావించే దర్శకుడు సుకుమార్‌ అభినందనలు అందుకోవడం అమితానందాన్నిచ్చింది. రియలిస్టిక్‌గా సినిమా చేశానని మెచ్చుకున్నారు. సుకుమార్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులకు ఈ సినిమా చాలా నచ్చింది. రీమేక్‌ సినిమాను చక్కటి మార్పులతో అద్భుతంగా తెరకెక్కించావని త్రివిక్రమ్‌ ప్రశంసించారు. వారితో పాటు చాలా మంది దర్శకులు మంచి సినిమా చేశానని అన్నారు. నేను అభిమానించే దర్శకుల అభినందనల్ని అందుకోవడం సంతోషంగా అనిపించింది.

‘వకీల్‌సాబ్‌’కు సీక్వెల్‌ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి?
‘వకీల్‌సాబ్‌’కు సీక్వెల్‌ చేయాలని నేను అనుకోలేదు. అభిమానుల నుంచి ఆ వార్తలొచ్చాయి. సీక్వెల్‌ రావాలని వారు కోరుకుంటున్నారు. అవకాశం వస్తే సీక్వెల్‌ చేయడానికి నేను సిద్ధమే. వకీల్‌సాబ్‌గా పవన్‌ పాత్ర ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. ఈ పాత్రను దృష్టిలో పెట్టుకొని సీక్వెల్‌ కోసం రసవత్తరమైన కథ రాసుకోవచ్చునని నమ్ముతున్నా.

‘ఐకాన్‌’ ఎప్పుడూ మొదలుకానుంది?
‘ఐకాన్‌’ గురించి మాట్లాడుకోవడానికి సమయం ఉంది.

Advertisement
విజయాన్ని బోనస్‌గా భావిస్తున్నా
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement