బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుస షూటింగ్స్‌లలో పాల్గొంటున్న నేపథ్యంలో అలియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే క్వారంటైన్‌కు వెళ్లింది అలియా. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బెడ్‌పై పడుకొని కాస్త నీరసంగా ఉన్న ఫొటోలను షేర్ చేసిన అలియా భట్.. కలలను మేల్కొనపవద్దు అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్స్ చూసి అలియా అభిమానులు త్వరగా కోలుకోవాంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో అలియా భట్ ఒకరు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, ఆర్.ఆర్.ఆర్, గంగూబాయి కతియావాడి వంటి సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలన్నీ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్ర పోషిస్తుంది అలియా భట్. ఇటీవల అలియా భట్ లుక్కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో అలియా ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. గంగూబాయి కతియావాడి చిత్రంలో అలియా భట్ వేశ్యగా కనిపించనున్న విషయం విదితమే.