బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 08:03:07

క‌త్రినా ఇంట్లో విక్కీ కౌశ‌ల్‌.. నెటిజ‌న్స్‌లో అనుమానాలు

క‌త్రినా ఇంట్లో విక్కీ కౌశ‌ల్‌.. నెటిజ‌న్స్‌లో అనుమానాలు

బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్.. యువ హీరో విక్కీ కౌశ‌ల్‌తో ప్రేమాయ‌ణంలో ఉంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ సంద‌ర్భంలో విక్కీ ఈ వార్త‌ల‌ని ఖండించ‌గా, తాజాగా ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫోటోల‌ని చూస్తుంటే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే అనుమానం జ‌నాల‌లో క‌లుగుతుంది

అర్ధ‌రాత్రి వేళ విక్కీ కౌశ‌ల్ ఫోటోగ్రాఫ‌ర్ కంట ప‌డ‌కుండా క‌త్రినా ఇంట్లో ప్ర‌త్యక్ష‌మ‌య్యాడు. అయితే విక్కీ కౌశ‌ల్‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండడంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని బీటౌన్ కోడై కూస్తుంది. క‌త్రినా ఇంటికి వెళ్లే స‌మ‌యంలో విక్కీ కౌశ‌ల్  తలకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజు ధరించిన‌ట్టు ఫోటోల ద్వారా అర్ధ‌మ‌వుతుంది. 


logo