సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 16:09:27

విక్కీ డొనార్ న‌‌టుడు భూపేశ్ కుమార్ కన్నుమూత

విక్కీ డొనార్ న‌‌టుడు భూపేశ్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ న‌టుడు భూపేశ్ కుమార్ పాండ్యా కన్నుమూశారు. కొంత‌కాలంగా ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ తో బాధప‌డుతున్న భూపేశ్ కుమార్ బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచిన‌ట్టు నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ ఎస్ డీ)ట్వీట్ చేసింది. భూపేశ్ కుమార్ నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా 2001 బ్యాచ్ స్టూడెంట్‌. భూపేశ్ కుమార్ పాండ్యా మృతి తీవ్రదిగ్భ్రాంతి క‌లిగించే విష‌యం ఎన్ ఎస్డీ కుటుంబం త‌రుపున హృద‌య‌పూర్వ‌క శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టిస్తున్నాం. దేవుడు ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నామి..ఎన్ ఎస్ డీ  హిందీలో ట్వీట్ చేసింది.

న‌టుడు మ‌నోజ్ బాజ్‌పేయి, గ‌జ రాజ్ రావ్‌, ద‌ర్శ‌కుడు ముఖేశ్ చాబ్రాతోపాటు ప‌లువురు సెల‌బ్రిటీలు భూపేశ్ కుమార్ కు నివాళి అర్పించారు. విక్కీడొనార్, ప‌ర్ మాణు చిత్రాల‌తో ప‌లు సినిమాల్లో న‌టించారు. 100కు పైగా నాట‌కాలు కూడా వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్కీ డొనార్ చిత్రంలో డాక్ట‌ర్ చ‌ద్దా అసిస్టెంట్ గా చ‌మ‌న్ పాత్రలో న‌టించాడు భూపేశ్ కుమార్. కామెడీ ట‌చ్ తో సాగే ఈ పాత్ర‌ ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. 

మన ప్రియ‌మైన మిత్రుడు క్యాన్స‌ర్ తో పోరాడుతున్న భూపేశ్ కుమార్ కు సాయం చేయండి. అత‌నికి అత్య‌వ‌స‌రంగా మీ వంతుగా ఆర్థిక సాయం చేసి అండ‌గా నిల‌వండ‌ని న‌టుడు రాజేశ్ టెయిలాంగ్ కొన్ని రోజులు క్రితం కోరిన‌ట్టు జాతీయ మీడియా క‌థ‌నం. భూపేశ్ కుమార్ ట్రీట్ మెంట్ కు రూ.25 ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌వ‌గా..అత‌ని కుటుంబం ఫండ్ రైజింగ్ ద్వారా డ‌బ్బు  సేక‌రించే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo