సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 10:33:14

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌‌య్య ఆరా

ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌‌య్య ఆరా

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఎంజీఎం ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. తమ అభిమాన గాయ‌కుడు త్వ‌ర‌గా కోలుకుని క్షేమంగా తిరిగి రావాల‌ని సంగీత ప్రియులు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆరా తీశారు. ఎంజీఎంహెల్త్ కేర్ ఆస్ప‌త్రికి ఫోన్ చేసిన వెంక‌య్య..ఎస్పీ బాలు ఆరోగ్యంపై డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఇప్ప‌టికీ బాలు ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఆయ‌న కోలుకునేందుకు ఉత్త‌మ వైద్యం అందిస్తున్నామ‌ని ఆస్ప‌త్రి వైద్యులు వెంక‌య్య‌కు చెప్పిన‌ట్టు సమాచారం. అవ‌స‌ర‌మైతే నిపుణుల సాయం కూడా తీసుకోవాల‌ని డాక్ట‌ర్ల‌కు వెంక‌య్య సూచించారు. ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు నెల్లూరు జిల్లావాసులే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo