శనివారం 06 జూన్ 2020
Cinema - May 04, 2020 , 14:46:18

రామాయ‌ణంపై ప్ర‌శంస‌లు కురిపించిన ఉప రాష్ట్ర‌ప‌తి

రామాయ‌ణంపై ప్ర‌శంస‌లు కురిపించిన ఉప రాష్ట్ర‌ప‌తి

రామానంద్‌ సాగర్‌ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన రామాయ‌ణ్ సీరియ‌ల్ తొలుత 1987లో దూరదర్శన్‌ ప్రసారం చేసిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న మ‌ళ్లీ 33 ఏళ్ళ త‌ర్వాత ఈ సీరియ‌ల్ దూర‌ద‌ర్శ‌న్‌లో పునఃప్ర‌సార‌మైంది. రీ టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్ తాజాగా స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.  మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 16 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌ను 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇది ప్రపంచరికార్డని డీడీ నేషనల్‌ చానల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

రామాయ‌ణం సీరియ‌ల్ ఈ రికార్డ్ సాధించ‌డం ప‌ట్ల భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు త‌న ట్విట్టర్ ద్వారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్ర‌శంసించారు. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందిన సీరియ‌ల్స్‌ని  దూరదర్శన్ తిరిగి ప్రసారం చేయడం స్వాగతించదగిన‌ది మరియు ప్రశంసనీయం. మన గొప్ప సాంస్కృతిక , జానపద సంప్రదాయానికి కొత్త తరాన్ని పరిచయం చేయడంలో దూరదర్శన్ చేసిన ఈ ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను అని త‌న ట్వీట్‌లో వెంకయ్య నాయుడు స్ప‌ష్టం చేశారు. రామాయ‌ణం గొప్ప త‌నాన్ని ప్ర‌శంసిస్తూ హిందీ, ఇంగ్లీష్‌, కన్న‌డ భాష‌ల‌లో ఆయ‌న ట్వీట్స్ చేయ‌డం విశేషం.


logo