ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 05, 2020 , 00:12:41

దర్శకుడి కలలు

దర్శకుడి కలలు

శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్‌ రాథోడ్‌ దర్శకుడు. తూము నరసింహాపటేల్‌ నిర్మిస్తున్నారు. తమన్నా వ్యాస్‌ కథానాయిక. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను  హీరో సునీల్‌ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘సినిమాలపై ఇష్టంతో భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత నేను కలిసి మొదటివ్యక్తి శివాజీరాజా. నేను సక్సెస్‌ అవుతానని నమ్మారు. ఆయన తనయుడు విజయ్‌రాజాకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి.  టైటిల్‌ పాజిటివ్‌గా ఉంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన మంచి టీమ్‌ కుదిరిందని శివాజీరాజా చెప్పారు. విజయ్‌రాజా మాట్లాడుతూ ‘నా పుట్టినరోజున టీజర్‌ విడుదలకావడం ఆనందంగా ఉంది. ఓ సినీ దర్శకుడి కథ ఇది. ఇళ్లు కట్టుకొని, మంచి అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని కలలు కన్న అతడి జీవితగమనంలో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ఇదే టీమ్‌తో మరో సినిమా చేయబోతున్నా’ అని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఈసినిమా షూటింగ్‌ చేశామని దర్శకుడు చెప్పారు. 


logo