మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 08:06:25

బాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ద‌ర్శ‌క నిర్మాత మృతి

బాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ద‌ర్శ‌క నిర్మాత మృతి

బాలీవుడ్‌లో వ‌రుస విషాదాలు ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. మార్చి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 25 మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు క‌న్నుమూశారు. ఇందులో  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ,. ఇర్ఫాన్ ఖాన్, రిషికపూర్, సరోజ్ ఖాన్, రాజన్ సెహగల్ త‌దిత‌రులు ఉన్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ(82)  శ‌నివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు 

జానీ బ‌క్షీ కొంత కాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఇంటి ద‌గ్గ‌రే ఉండి వైద్యం తీసుకుంటుండగా, సెప్టెంబ‌ర్ 4న ప‌రిస్థితి విష‌మించ‌డంతో జుహూలోని ఆరోగ్య‌నిధి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గుండెపోటు రావ‌డంతో సెప్టెంబ‌ర్ 5 ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న మృతిపై బాలీవుడ్ ఇండ‌స్ట్రీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. 

ద‌ర్శకుడిగా, నిర్మాత‌గా జానీ ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాలు రూపొందించారు. ఇందులో రాజేశ్‌ ఖన్నా కథానాయకుడిగా నటించిన ‘ఖుదాయి’తో పాటు ‘డాకు ఔర్‌ పోలీస్‌’ చిత్రానికి జానీ బక్షీ దర్శకత్వం వహించారు.మంజిలే ఔర్ భీ హై , రావణ్ , ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ లాంటి హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధించారు. 


logo