శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Feb 11, 2021 , 17:53:09

'గాడ్సే' ‌ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

'గాడ్సే' ‌ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

విలక్షణ కథా చిత్రాలు, పాత్రలతో హీరోగా, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు  తెచ్చుకున్న హీరో  సత్యదేవ్.  ఎడ్యుకేషన్ నేప‌థ్యంలో   సత్యదేవ్ హీరోగా సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం "గాడ్సే" రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సినిమాకు  డైరెక్టర్‌ గోపీ గణేశ్‌ దర్శకత్వం వ‌హించ‌నున్నారు.  ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని  అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.

ఈ  సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో  చిత్ర నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు,  హీరో సత్యదేవ్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ, దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి, సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్, నటులు ప్రకాష్ నాగ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. డైరెక్టర్‌ గోపీ గణేశ్‌ దర్శకత్వంలో ఇంతకుముందు సత్యదేవ్‌ 'బ్లఫ్‌ మాస్టర్‌' సినిమా చేసిన సంగతి తెలిసిందే. 

VIDEOS

logo