మంగళవారం 02 జూన్ 2020
Cinema - Feb 04, 2020 , 08:22:13

తాగుబోతు రమేష్‌తో వెన్నెల కిషోర్‌ కామెడీ

తాగుబోతు రమేష్‌తో వెన్నెల కిషోర్‌ కామెడీ

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వెన్నెల కిషోర్‌ తాజాగా తాగుబోతు రమేష్‌కి సంబంధించిన ఓ వీడియో షేర్‌ చేశారు. ఈ వీడియోలో బ్యాంకాక్‌ని మిస్‌ అవుతున్నావా అని రమేష్‌ని ప్రశ్నిస్తాడు కిషోర్‌. అందుకు మిస్‌ అవుతున్నాను అంటూ కారణం చెప్పాడు. అక్కడ మసాజ్‌ సెంటర్లకు వెళ్తే మసాజ్‌ చేయించుకోవడం, కాళ్ళు చేపల తొట్టెలో పెడితే చేపలు వచ్చి కొరకడం గొప్ప థ్రిల్‌గా ఉంటుందని అన్నాడు. ఈ చెరువులోను అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ దొరకుతుందో లేదో చూద్దాం అని చెరువులోకి దిగి కాళ్ళు పెట్టగా, చేపలు వచ్చి రమేష్‌ కాళ్ళని కొరకడం మొదలు పెట్టాయి. ఈ తతంగాన్ని వీడియో తీసి వెన్నెల కిషోర్‌ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. 


logo