బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 21:25:14

‘వెన్నెల చిరునవ్వై’ సాంగ్ లాంఛ్ చేసిన శంక‌ర్

‘వెన్నెల చిరునవ్వై’ సాంగ్  లాంఛ్ చేసిన శంక‌ర్

‘వెన్నెల చిరునవ్వై’ పాట మెలోడియస్ గా ఉందని, చాలా రోజుల తర్వాత నటుడు శ్రీరాం ఈ సినిమాలో చాలా బాగా నటించాడని దర్శకుడు ఎన్ శంకర్ తెలిపారు. ఎక్సోడస్ మీడియా నిర్మించిన ’అసలేం జరిగింది’ సినిమాలోని ‘వెన్నెల చిరునవ్వై‘ సాంగ్ లిరికల్ వీడియోని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ..తెలంగాణలో జరిగిన విభిన్నమైన సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాక్షించారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పక ఆదరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 


చిన్న సినిమాలు విడుదల చేయడానికిదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా.. నటుడు శ్రీరాం, సంచితా పడుకునే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సందర్భంగా నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జరిగిన వాస్తవ సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ థ్రిల్లర్, సస్పెన్స్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు.

నిర్మాత కింగ్ జాన్సన్ మాట్లాడుతూ..మ్యూజిక్ డైరెక్టర్ ఏలెంద్ర మహావీర్ మనసు పెట్టి మంచి పాటల్ని అందించారని ప్రశంసించారు. విజయ్ ప్రకాశ్ పాడిన వెన్నెల చిరునవ్వై పాట ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. ఈ చిత్రం ద్వారా జనగాంకు చెందిన రవికుమార్ ప్రతి నాయకుడిగా పరిచయం అవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు టేక్మాల్ శ్రీకార్ రెడ్డి, సంగ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo