నారప్ప..రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్తో ప్రదర్శించబడుతున్న సినిమా. చాలా కాలం తర్వాత వెంకటేశ్ లోని మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించిన చిత్రం నారప్ప. ఈ చిత్రంలో వెంకీ మధ్య వయస్కుడిగా, యంగ్ గా రెండు లుక్స్ లో కనిపిస్తాడు. అయితే ఈ సారి వెంకీ యంగ్ లుక్ లో గతంలో కనిపించిన దాని కంటే కాస్త భిన్నంగా ఉన్నాడు. దీనిక్కారణం వయసనే చెప్పాలి. మేకప్, గ్రాఫికల్ ఎఫెక్ట్ ఉన్నప్పటికి వయస్సు మీద పడ్డ ఛాయలు కనిపించకుండా దాచలేకపోయాడు వెంకీ. నారప్ప ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇపుడు సీనియర్ హీరోలకు వార్నింగ్ బెల్ గా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడున్న టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెంకీతోపాటు చిరంజీవి, నాగార్జున ఆరు పదుల వయస్సుకు చేరుకున్న వారే. వీరిలో అందరికంటే ఫిట్ గా కనిపించేది నాగార్జున. అయితే మన్మథుడు 2లో నాగార్జున కనిపించిన లుక్ కు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఈ వయస్సులో యంగ్ రోల్స్ చేయకపోవడమే బెటరని నాగ్ ఫిక్సయ్యాడని అంతా అనుకుంటున్నారు.
ఇక సైరా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి యంగ్ బ్యూటీ తమన్నాకు జోడీగా కనిపించే విషయంలో కూడా అప్పియరెన్స్ లేకుండా పోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అదే ఖైదీ నంబర్ 150 సినిమాలో కాజల్ తో జోడీ విషయంలో సెట్టయింది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తున్న ప్రాజెక్టు కావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. కానీ ఇది అన్ని సందర్బాల్లో వర్కవుట్ కాదు.
హీరోలు యాక్టివ్ గా కనిపించినప్పటికీ వారి వయస్సుకు సంబంధించిన భావన ప్రేక్షకుల్లో ఉండటం కూడా కారణం కావొచ్చు. మొత్తానికి మన సీనియర్ హీరోలకు ఇపుడు యంగ్ లుక్ లో కనిపించే రోల్స్ వస్తే ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న వార్నింగ్ బెల్ మోగుతుందని తెగ చర్చించుకుంటున్నా సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్