శుక్రవారం 29 మే 2020
Cinema - Jan 21, 2020 , 23:41:13

వెంకటేష్‌ నారప్ప

వెంకటేష్‌ నారప్ప

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత  హీరో వెంకటేష్‌, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కలయికలో మరో సినిమా తెరకెక్కుతున్నది.  తమిళ చిత్రం ‘అసురన్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి  ‘నారప్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ పతాకాలపై సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం (నేడు) ప్రారంభంకానుంది. ప్రతీకార కథాంశంతో   రూపుదిద్దుకోనున్న  ఈ చిత్రంలో  మధ్యవయస్కుడైన వ్యక్తిగా వెంకటేష్‌ కనిపించబోతున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్యామ్‌ కె నాయుడు ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 


logo