టాలీవుడ్(Tollywood)లో దగ్గుబాటి హీరోలు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబినేషన్ లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రాజెక్టు వస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ షోకు రానా నాయుడు (Rana Naidu) టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా రాబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. బుధవారం రానా నాయుడు షూటింగ్ మొదలైంది.
మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పని చేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ షోను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ, రానా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వెంకటేశ్ ఎఫ్ 3లో నటిస్తున్నాడు. మరోవైపు వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాట పర్వం, సాగర్ చంద్ర డైరెక్షన్లో భీమ్లా నాయుక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ బాబాయి-అబ్బాయిలు గతంలో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో కలిసి మెరిశారు.
ఇక రానా నాయుడు ప్రాజెక్టుతో ఈ ఇద్దరు మరోసారి సందడి చేయనుండటంతో చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి షోలో ఫీమేల్ లీడ్ రోల్స్ లో ఎవరు కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్