ఇటీవలి కాలంలో టాలెంటెడ్ దర్శకులు టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. వారిలో ఒకడు కేరాఫ్ కంచెరపాలెం ఫేం వెంకటేశ్ మహా. ఈ సినిమాతో బడా దర్శకనిర్మాతల చూపు తనవైపు తిప్పుకున్నాడు వెంకటేశ్ మహా. ఇటీవలే వెంకటేశ్ మహా డాక్టర్ రాజేశేఖర్ తో ఓ సినిమా ప్రకటించాడు. ఈ యువ దర్శకుడు విక్టరీ వెంకటేశ్ తో అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్ డైరెక్ట్ చేయబోతున్నాడని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే వెంకీకి మహా యూనిక్ కాన్సెప్ట్‌తో రెడీ చేసుకున్న కథను వినిపించగా..వెంకటేశ్ ఇంప్రెస్ అయ్యాడట. అంతేకాదు త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మూవీకి మేకర్స్ మంచి బడ్జెట్ సిద్దం చేయడమే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. మహా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని టాక్. లాక్ డౌన్ పూర్తవగానే దీనికి సంంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి..
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
బ్యాక్ టు బ్యాక్ మూవీస్..సొంతంగా డబ్బింగ్
అండర్ వాటర్ అడ్వెంచర్..కైరా స్టిల్ అదరహో