వెంకటేశ్..ఈ టాలీవుడ్ స్టార్ హీరో సెట్స్ లో ఉన్నాడంటే చాలు సందడే సందడి. వెంకీ సినిమాలంటే వినోదానికి కొదవే ఉండదు. ఇప్పటికే ఎఫ్ 2లో కామెడీ టచ్‌తో అలరించిన వెంకీ ఈ సారి ఎఫ్3తో ట్రిపుల్ రేంజ్ కామెడీని అందించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఎఫ్ 3 చిత్రీకరణ హైదరాబాద్‌లో రీస్టార్ట్ అయింది. వెంకీ, మెహరీన్, సునీల్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి బయటకు వచ్చిన స్టిల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి.
వెంకటేశ్ షూటింగ్ స్పాట్లో వరుణ్ తేజ్, సునీల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్ తో కామెడీ చేస్తున్నపుడు అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. దీంతోపాటు మరో స్టిల్ కూడా ట్విటర్ లో పోస్ట్ చేశారు మేకర్స్. ఈ స్టిల్స్ ఎఫ్ 3లో కామెడీ మరోస్థాయిలో ఉండబోతుందని చెప్పకనే చెబుతున్నాయి. వరుణ్ తేజ్ నెక్ట్స్ మైసూరు షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. వెంకీ రేచీకటి ఉన్న వ్యక్తిగా కనిపించబోతుండగా..కడుపుబ్బా నవ్వించే సీన్లు ఉండబోతున్నట్టు టాక్.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ షూట్ ఎక్కడంటే..?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్