వెంకటేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’ రీమేక్ ఇది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ పతాకాలపై సురేష్‌బాబు, ఎస్.థాను నిర్మిస్తున్నారు. మే 14న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా సెకండ్‌వేవ్ ప్రభావంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది. ‘ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయబోవడం లేదు. కరోనా సంక్షోభాన్ని మనందరం అధిగమించిన తర్వాత సినిమాను విడుదల చేస్తాం. అందరూ క్షేమంగా ఉండండి’ అంటూ వెంకటేష్ ట్విట్టర్లో కోరారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.