సోమవారం 25 మే 2020
Cinema - Mar 13, 2020 , 08:17:39

జూలైలో వ‌రుణ్ తేజ్ హంగామా

జూలైలో వ‌రుణ్ తేజ్ హంగామా

చివ‌రిగా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వంలో బాక్సింగ్ నేప‌థ్యంతో చిత్రం చేస్తున్నాడు.   అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకోగా, మూవీని జూలై 30న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

 ఫిబ్ర‌వ‌రి 24న స్టార్ట్ అయిన చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ని వైజాగ్‌లో జరుపుకుంది. ఏప్రిల్ 3న కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌లో  మొద‌లు కానుంది.  ఈ షెడ్యూల్‌తో చిత్ర షూటింగ్ పూర్తి కానుంది.  బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేక‌మైన శిక్షణ తీసుకుని వ‌రుణ్‌ చాలా మేకోవ‌ర్ అయ్యారు.  మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం, జార్జ్ సి.విలియ‌న్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంక‌టేశ్‌ ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. 


logo