ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 29, 2020 , 10:14:54

సంక్షోభం స‌మ‌యంలో నా వంతు సాయం: వ‌రుణ్ తేజ్

సంక్షోభం స‌మ‌యంలో నా వంతు సాయం: వ‌రుణ్ తేజ్

కరోనా మహమ్మారి వివిధ రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న విష‌యం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చాలా మంది పేద కళాకారులు, సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వీరిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు.ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ రూ.20ల‌క్ష‌ల విరాళాన్ని సిసిసి కి ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌కటించాడు. సంక్షోభం స‌మ‌యంలో నా వంతు సాయం చేస్తున్నాను. దయచేసి మీరు కూడా చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి మీ వంతు కృషి చేయండి అని వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. 


logo