దుమ్ము రేపిన‌ సారా, వ‌రుణ్..తేరి బాబీ వీడియో సాంగ్‌

Dec 03, 2020 , 19:08:51

1995లో  గోవిందా, క‌రీష్మా క‌పూర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం కూలీ నెంబ‌ర్ 1. ఈ చిత్రాన్ని సారా అలీఖాన్‌-వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి రీమేక్ చేస్తున్నారు. డేవిడ్ ధావ‌న్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మూవీ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లైన మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తేరి బాబీ సాంగ్ ను విడుద‌ల చేశారు. రైల్వే స్టేష‌న్ లో కూలీల టీం, ప్యాసెంజ‌ర్స్ టీంల‌తో క‌లిసి వ‌రుణ్ ధావ‌న్‌, సారా అలీఖాన్ చేసిన డ్యాన్స్ సూప‌ర్భ్ గా ఉంది. వ‌రుణ్ ధావ‌న్ తో పోటీగా సారా అలీఖాన్ స్టెప్పులేసి అద‌ర‌గొట్టింది.

తేరి బేబి సాంగ్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌తో ఈల‌లు వేయించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు స‌లీమ్-సులేమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 25న విడుద‌ల కానుంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD