సుదీర్ఘ విరామం తర్వాత హీరోగా పునరాగమనం చేస్తున్నారు వరుణ్‌సందేశ్. ఆయన కథానాయకుడిగా ‘ఇందువదన’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఫర్నాజ్‌శెట్టి కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం చిత్రబృందం విడుదలచేసింది. రొమాంటిక్‌గా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. ఇందులో వరుణ్ సందేశ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్న ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందువదన ఎవరన్నది ఆసక్తిని పంచుతుంది. వరుణ్‌సందేశ్ నటన, పాత్రచిత్రణ వైవిధ్యంగా సాగుతాయి. తనను తాను సరికొత్త పంథాలో ఆవిష్కరించుకుంటూ ఆయన చేస్తున్న చిత్రమిది. ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. రఘుబాబు,ఆలీ, నాగినీడు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివకాకాని, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సతీష్ ఆకేటి.